బద్రినాథ్‌కు బారెడు కష్టాలు
కాగా బుధవారం గీతా ఆర్ట్‌సకు చెందిన ప్రతినిధులు బెంగళూరుకు వచ్చి, ఫిలింఛాంబర్‌కు చేరుకుని కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు బసంత్ కుమార్ పాటిల్, ప్రముఖ నిర్మాత సా.రా. గోవిందు తదితరులతో మంతనాలు సాగించారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న నిర్మాతను కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయానికి పిలిపించి చర్చలు జరపడానికి ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో గురువారం చర్చిస్తామని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు చెప్పడంతో గీతా ఆర్ట్‌స ప్రతినిధులు వెనుదిరిగారని సమాచారం. బెంగళూరుకు చెందిన డిస్ట్రిబ్యూటర్లకు సినిమా పంపిణీ హక్కులు ఇవ్వకుండా స్వయంగా గీతా ఆర్ట్‌స సంస్థ విడుదల చేస్తున్నందున ఈ సమస్య వచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి.
చర్చలు ఫలించకపోవడంతో గురువారం ఉదయం నుండి ఫిలింఛాంబర్‌లో చర్చలు జరుపుతున్నారు. ఎట్టకేలకు సినిమా విడుదలకు ప్రయత్నాలు మమ్మురం చేస్తున్నారు. కర్నాటకలో ఎన్నడూ లేని విధంగా పబ్లిసిటీి కూడా భారీగానే ఇచ్చారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడంతో సహా తమిళ, మళయాళ బాషల్లో ఒకేసారి విడుదల చేయాలని సన్నాహాలు చేసారు.అయితే ‘మావీరన్’ (మగధీర తమిళ డబ్బింగ్ చిత్రం) తమిళంలో కనీస స్థాయిలో కూడా ప్రభావాన్ని చూపలేకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ‘బద్రినాధ్’ తమిళ అనువాదాన్ని వాయిదా వేస్తున్నారు. కనుక మళయాళ, తెలుగు వెర్షన్స్ మాత్రం విడుదల అయిపోతాయి.
inkaa chaala vunnai wat abt that..........
ReplyDelete