బ్రమ్మిగాడు తెగ నచ్చుతాడు!
సమస్యల్లో ఉన్నవారికి సహకరించేవాడిగా..పరిపక్వత ఉన్న పాత్రలో నేను నటించాను. జూలై 1న మీ ముందుకొస్తున్నాం’ అన్నారు. అస్మితాసూద్ మాట్లాడుతూ ‘ఓ అమాయకమైన అమ్మాయిగా సినిమాలో నటించాను. నా పాత్రచుట్టూనే కథ నడుస్తుంది. హాస్యం, యాక్షన్, రొమాన్స్, డ్రామా..అన్నీ ఉన్న సినిమా ఇది. హైదరాబాద్ నగరంలోని ప్రఖ్యాత ప్రదేశాలన్నిటా సినిమాని తెరకెక్కించారు’ అన్నారు. వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందిన ‘బ్రమ్మిగాడి కథ’ అన్ని వర్గాలవారినీ అమితంగా అలరిస్తుందనే ఆశాభావాన్ని దర్శకుడు ఈశ్వర్‌రెడ్డి వ్యక్తం చేసారు!
No comments:
Post a Comment