Dog

Friday, 10 June 2011

SUNIL, DEVI PRASAD COMBINATION

సునీల్‌ - దేవిప్రసాద్‌ కాంబినేషన్‌లో
sunilహిందీలో ఘన విజయం సాధించిన ‘తను వెడ్స్‌ మను’ చిత్రాన్ని తెలుగులో సునీల్‌ హీరోగా రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో శ్రీకాంత్‌ కాంబినేషన్‌లో సునీల్‌ నటించిన ‘ఆడుతూ.. పాడుతూ’ చిత్రానికి దర్శకత్వం వహించిన దేవిప్రసాద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సునీల్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘అందాల రాముడు’ చిత్రాన్ని నిర్మించిన మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. ‘ఆడుతూ.. పాడుతూ’, ‘లీలామహల్‌ సెంటర్‌’, ‘బ్లేడు బాబ్జీ’ వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించి, కామెడి పండిం చడంలో సిద్దహస్తుడిగా పేర్గాంచిన దేవిప్రసాద్‌ ‘తను వెడ్స్‌ మను’ చిత్రానికి తెలుగు నేటివిటీకి తగినట్లుగా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసారని, త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది!

No comments:

Post a Comment