Dog

Wednesday, 22 June 2011

v.v vinayak about badrinath

ముందు మేమూ.. ఫ్లాప్‌ అనే ఫిక్సయిపోయాం !
vvvinayakతొలిరోజు బద్రినాధ్‌ కు వినిపించిన డివైడెడ్‌ టాక్‌ను బట్టి మేము కూడా సినిమా పోయిందనే ఫిక్సయిపోయాం. సినిమా విడుదలైన రెండుమూడు వా రాల తర్వాత రిలీజ్‌ చేసేం దుకు సిద్దం చేసుకున్న ‘మేకింగ్‌ అఫ్‌ బద్రినాధ్‌’ ట్రయిలర్స్‌.. సమన్వయ లోపం కారణంగా సిని మా విడుదలకు ముందుగానే మీడియాకు రిలీజ్‌ అయిపోవడంతో, ఈ చిత్రాన్ని అందరూ ‘మగధీర’ తరహా చిత్రమని అనుకోవడం వలన మొదటి రోజు సినిమా చూసినవాళ్లంతా కొంత నిరాశపడిన మాట వాస్తవం. అయితే.. మొదటి రోజు నుంచి నేటి వరకు లెక్షన్లు రికార్డు స్థాయిలో ఉండడంతో.. ఈ చిత్రం విషయంలో మా అంచనాలు తప్పు కాలేదని నిరూపితమైంది.

ఈ సినిమా ఫెయియ్యే ఛాన్స్‌ లేదని నాకు మొదటి రోజే నా మిత్రుడు కాశీ (‘కృష్ణ’ నిర్మాత) చెప్పాడు. అయితే నామీద అభిమానంతో అతను అలా అంటున్నాడని భావిం చి.. నా డిజప్పాయింట్‌మెంట్‌లో నేను ఉండిపోయాను. కానీ ఇప్పుడు అతని మాటే నిజమయ్యింది’ అంటున్నారు ‘బద్రినాధ్‌’ చిత్ర దర్శకులు వి.వి.వినాయక్‌. అల్లు అర్జున్‌ టైటిల్‌ పాత్రలో తమన్నా హీరోయిన్‌గా గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన ‘బద్రినాధ్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన వి.వి.వినాయక్‌ మీడియాతో ప్రత్యేకంగా సమావేశమై, తన మనోభావాలను పంచుకున్నారు. ‘బద్రినాధ్‌’.. బన్నీ (అల్లు అర్జున్‌) కెరీర్‌లోనే అతి పెద్ద విజయంగా నిలుస్తోందని, తన కెరీర్‌లోనూ ‘ఠాగూర్‌’ తర్వాత ఆ స్థాయి విజయం ఇదేనని వినాయక్‌ పేర్కొన్నారు.

బన్నీ డాన్సులు, తమ న్నా అందాలు, ఆమె అభినయం, ఆనందసాయి సెట్స్‌, కీరవాణి సంగీతం, అంతర్జాతీయస్థాయి నిర్మాణ విలువలు.. ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తన తదుపరి చిత్రం నూటికి తొంబైపాళ్లు రామ్‌చరణ్‌తోనే ఉంటుందని.. ప్రస్తుతం కథాచర్చలు జరుపుతున్నామని.. చరణ్‌ ఇమేజ్‌కు సూటయ్యే విధంగా సబ్జెక్ట్‌ షేప్‌ తీసుకున్న పక్షంలో, త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్తుందని వినాయక్‌ స్పష్టం చేసారు!

No comments:

Post a Comment